గౌరునాయుడు కథలు-సామాజిక చిత్రణ శ్రీ గంటేడ గౌరునాయుడుగారు ఉత్తరాంధ్ర సాహితీవేత్తలలో ప్రముఖులు. వీరు సమాజాన్ని అంచనా వేయడంలో సిద్ధహస్తులు. రైతులు, బడుగుజీవుల పట్ల ఆర్తి, వారి కష్టాల పట్ల ఆవేదన, మారని స్థితిగతుల పట్ల అసహనం, నిరసన ఈయన కథల్లో కనిపిస్తాయి.

    ఉత్తరాంధ్ర ప్రజల కన్నీళ్ళు, కష్టాలు, సామాజిక పరిస్థితులు వీరి రచనల్లో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో 1954 ఆగస్టు