అక్షరలిపి అనేది స్వీయ ప్రచురణ అలాగే కథలు ,ధారావాహికలు ,కవితలు, నవలలు ,సమీక్షలు ,కామెడీ కథలు ,పిల్లల కథలు ,ముఖ్యంగా ప్రేమ కథలు ప్రచురించే ఒక సొంత ప్రచురణ వేదిక (వెబ్ సైట్ ) , దీని ద్వారా అక్షరలిపి లో వారి యొక్క ప్రచురణను రాసే కథకులు , రచయితలు అలాగే పాఠకులకు ఒకరిని ఒకరికి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియచేప్పెందుకు ఏర్పరిచిన ఒక ఆన్లైన్ వేదిక, అక్షరలిపి ప్రస్తుతానికి ఒక్క భాష "తెలుగు " లోనే అందుబాటులో ఉన్నది , కానీ రచయితలు ఏ భాషలో అయినా వారి కంటెంట్ ను ప్రచురించవచ్చు.. అక్షరలిపి లో పాఠకులు అందరూ కథలు ,ధారావాహికలు ,కవితలు, నవలలు ,సమీక్షలు ,కామెడీ కథలు ,పిల్లల కథలు ,ముఖ్యంగా ప్రేమ కథలు ఉచితంగా చదువుతూ రాసే వారికీ తగిన సలహాలు సూచనలు ఇవ్వవచ్చును ..

అక్షరలిపి అనేది తెలుగు పదము అక్షరలిపి అనేది అందరికీ అందుబాటులో ఉండి పలకడానికి సరళంగా ఉండేలా ఏర్పాటు చేసినది ... అక్షరలిపి లో కంటెంట్ ను చదివే అందరూ కంటెంట్ ను రాసే వాళ్ళకు తగిన "rating" ఇవ్వవచ్చును ..అక్షరలిపి లో మీరు మీ సొంత అభిప్రాయాలను, అనుభవాలను, మీకు జరిగిన విషయాలను, గమనించిన విషయాలన్నిటిని నిస్సంకోచంగా మీరు ప్రచురించవచ్చు . ఒక వేళ మీరు రాసే విషయాలన్నిటిని మీరు దాచాలి లేదా గోప్యంగా ఉందాలి అని అనుకున్నట్టు అయితే రచయితలు ఆ విషయాన్నీ మాకు మెయిల్ ద్వారా తెలపవచ్చును. ఇక మీ దృష్టికి వచ్చిన సామజిక విషయాల గురించి కూడా మీరు మాకుమీ రచనల ద్వారా మీ స్పందనను తెలపవచ్చు. అలా మీరు ప్రజలను ఉత్తేజ పరచవచ్చు .. అక్షరలిపి లో మీ కథలు కవితలు ప్రచురిస్తున్న వారికి తగిన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే అక్షరలిపి లో రొజూ రాస్తున్న వారికీ ఇది పరిమితం అక్షరలిపి లో మీరు మీ రచనలు ప్రచురించడం వల్ల మీరు ఎంతో మందికి చేరువ అవుతారు.దాని కోసం మీరు చేయవలసింది అక్షరలిపిలో రచనలు అప్లోడ్ చేయడమే మీ సొంత రచనలు మాత్రమే చేయాలి,కాపి కంటెంటు కానీ మరెక్కడైనా ప్రచురించినవి కానీ ఇక్కడప్రచురించడం కుదరదు.

అక్షరలిపి అక్షరాలను కుర్చీ మాలగా గుచ్చి భావాలను సరళమైన భాషలో అందరితో పంచుకునేందుకు మన ముందుకు వస్తున్న, వచ్చిన ఒక స్వీయ ప్రచురణ వేదిక. దీన్ని అప్ గా కూడా మలచడానికి మేము సిద్దంగా ఉన్నామని తెలియచేయడానికి గర్వపడుతున్నాము..

అక్షరలిపిని శారద ఖండే, అర్జున్ ఖండే, శాంతి ఖండే , విధీర్ ఖండే, విధీర్ ఖండే జూనియర్ అనే వారు 2020 సెప్టెంబర్ లో అక్షరలిపిని రూపొందించడం జరిగింది వాళ్ళు తెలుగు భాషనూ ప్రోత్సహించడం,చిన్న చిన్న పదాలతో అందరికి అర్ధమయ్యే రీతిలో ముందుకు తేవడానికి ప్ర్రయత్నాలు చేసి సఫలీకృతులు అయ్యారు అని తెలియ చేయడానికి ఆనందిస్తున్నాము.