అట్టెం దత్తయ్య
పుట్టింది శట్పల్లి గ్రామం కామారెడ్డి జిల్లా. 'కళ్లం' (సాహిత్య వ్యాసరాశి) వ్యాస సంపుటి ప్రచురించారు. వివిధ సాహిత్య పత్రికలలో అరవైకి పైగా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ‘తెలంగాణ సాహిత్య గ్రంథసూచి’ ప్రధాన సంపాదకుడిగా, ‘నిత్యాన్వేషణం’, ‘శిలాక్షరం’ గ్రంథాలకు సంపాదకునిగా చేశారు. ‘మహాభారతంలో సంవాదాలు - సమగ్రపరిశీలన' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు. 'మూసీ సాహిత్య ధార' సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.